Header Banner

ఆధార్‌ కార్డ్ ఉంటే చాలు! లోన్‌ ఈజీగా తీసుకోవచ్చు! అప్లికేషన్‌ ప్రాసెస్‌ ఇదే!

  Sat Feb 22, 2025 09:00        Business

ఒకప్పుడు పర్సనల్‌ లోన్‌ పొందాలంటే చాలా తతంగం ఉండేది. చాలా డాక్యుమెంట్లు అడిగేవారు, టైమ్ కూడా పట్టేది. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని లోన్ ప్రాసెస్‌ చాలా ఈజీగా మారిపోయింది. అతి తక్కువ డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి నిమిషాల్లో లోన్‌ పొందవచ్చు. 

 

ఇన్‌స్టంట్‌ లోన్‌ అంటే ఏంటి?: ఇన్‌స్టంట్‌ లోన్‌ అనేది ఒక రకమైన పర్సనల్‌ లోన్‌. చాలా క్విక్‌గా అప్రూవల్‌, మంజూరు జరిగిపోతుంది. ఇన్‌స్టంట్‌ లోన్‌, పర్సనల్ లోన్ మధ్య తేడా అప్రూవల్‌ లభించే వేగం మాత్రమే. ఈ ప్రాసెస్ 100% ఆన్‌లైన్, పేపర్‌లెస్‌గా ఉంటుంది. దీంతో ఇన్‌స్టంట్‌ లోన్లు నిమిషాల్లోనే లభిస్తాయి. డిజిటల్ KYC (నో యువర్‌ కస్టమర్‌) ప్రాసెస్‌కు మినిమం డాక్యుమెంటేషన్‌ అవసరం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా రూ.15 లక్షల వరకు ఇన్‌స్టంట్‌ లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు సంవత్సరానికి 12% నుంచి ప్రారంభమవుతాయి. 

 

ఆధార్ కార్డుతో లోన్‌ పొందగలరా? ఇప్పుడు ఆధార్ కార్డ్‌తోనే ఇన్‌స్టంట్‌ లోన్‌ పొందవచ్చు. ఇతర ఐడెంటిటీ లేదా అడ్రస్‌ డాక్యుమెంట్లు అందుబాటులో లేకుంటే ఆధార్‌ సరిపోతుంది. ఇది ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ రెండింటికి పనిచేస్తుంది. డిజిటల్ KYCకి అవసరమైన ప్రైమీ డాక్యుమెంట్‌గా మారుతుంది. కొన్ని సంస్థలు పాలసీలను బట్టి పాన్ కార్డ్, ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ వంటి డాక్యుమెంట్స్ కూడా అడగవచ్చు. రూ.15 లక్షల వరకు డిజిటల్ ఇన్‌స్టంట్ లోన్స్ ఇప్పించడానికి మనీకంట్రోల్ ఏడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కస్టమర్లు కేవలం మూడు సింపుల్‌ స్టెప్స్‌తో లోన్‌ పొందవచ్చు. 

 

మొదట ఆన్‌లైన్‌లో మీ వివరాలను ఎంటర్‌ చేయండి. రెండు, మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి డిజిటల్ KYC ప్రాసెస్ పూర్తి చేయండి. మూడు, మీ ఈఎంఐ టెన్యూర్‌ ఎంచుకుని, అప్లికేషన్‌ సబ్మిట్‌ చేయండి. మీ ఉద్యోగం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు సంవత్సరానికి 12% నుంచి ప్రారంభమవుతాయి. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లోన్‌ బెనిఫిట్స్: క్విక్‌ అప్రూవల్‌: అప్రూవల్‌ ప్రాసెస్‌ వేగంగా, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. అంతా ఆన్‌లైన్‌ కావడంతో KYC కోసం బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా ఫండ్స్‌ అందిస్తుంది. 

 

అప్లికేషన్‌ ప్రాసెస్‌: సుదీర్ఘమైన అప్లికేషన్‌ ప్రాసెస్‌ ఉండదు. కొన్ని బేసిక్‌ డీటైల్స్‌ ఎంటర్‌ చేసి, లోన్‌ అమౌంట్‌, టెన్యూర్‌ ఎంచుకుంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయవచ్చు. 

 

డాక్యుమెంటేషన్: ఇతర లోన్‌లకు అందజేసిట్లు ఎక్కువ డాక్యుమెంట్లు అవసరం లేదు. ఇన్‌స్టంట్‌ లోన్‌కి తక్కువ పత్రాలు, ప్రధానంగా ఆధార్ కార్డును మాత్రమే అడుగుతారు. 

 

తాకట్టు: ఇన్‌స్టంట్‌ లోన్‌కి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. అంటే లోన్ కోసం ఆస్తులను రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. తాకట్లు ఏవీ లేనప్పుడు డబ్బు అవసరం అయినప్పుడు ఉపయోగపడతాయి. 

 

ఆధార్ కార్డ్ లోన్ అర్హతలు: తప్పనిసరిగా UIDAI జారీ చేసిన వ్యాలిడ్‌ ఆధార్ కార్డ్‌ ఉండాలి. అప్లికెంట్ భారతీయ పౌరులై ఉండాలి. వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి (సంస్థను బట్టి మారవచ్చు). అలానే తప్పనిసరిగా జీతం లేదా స్వయం ఉపాధి పొంది ఉండాలి, ఇన్‌కమ్ ప్రూఫ్ అందించాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Loans #Aadhar #InstantLoans